close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పునర్నవి నిశ్చితార్థం వెనుక అసలు కథ ఇది!

హైదరాబాద్‌: గత రెండురోజుల నుంచి నటి పునర్నవి పలు ఫొటోలతో నెటిజన్లను టీజ్‌ చేశారు. ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అని పేర్కొంటూ ఓ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ని కూడా అభిమానులతో పంచుకున్నారు. దీంతో నిజంగానే ఎంగేజ్‌మెంటా? లేక ఏదైనా సినిమా/వెబ్‌ సిరీస్‌ ప్రచారమా? అని చాలా మంది నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సరికొత్త పోస్టుతో.. వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగానే టీజ్‌ చేసినట్లు చెప్పకనే చెప్పేశారు.

పునర్నవి, రఘునందన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘కమిట్‌మెంటల్‌’. పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం పునర్నవి అభిమానులతో పంచుకున్నారు. త్వరలో ఈ సిరీస్‌ ‘ఆహా’ వేదికగా అభిమానులను అలరించనుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.