రెండో టీ20: దిల్లీపై టాస్‌ గెలిచిన పంజాబ్‌   - Punjab won the toss and elected to bowl
close
Updated : 20/09/2020 19:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో టీ20: దిల్లీపై టాస్‌ గెలిచిన పంజాబ్‌ 

బౌలింగ్‌ ఎంచుకున్న కేఎల్‌ రాహుల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో భాగంగా దుబాయి వేదికగా రెండో మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తాజా వికెట్‌పై ఏం ఆశించాలో తెలియదని, అయినా తమ జట్టుపై నమ్మకం ఉందన్నాడు. ఇక నలుగురు విదేశీ ఆటగాళ్లలో మాక్స్‌వెల్‌, పూరన్‌, జోర్డాన్‌, కాట్రెల్‌ ఉన్నారని చెప్పాడు. మరోవైపు గతేడాది దిల్లీని ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి. శ్రేయస్‌ మాట్లాడుతూ తాము టాస్‌ గెలిచినా తొలుత బౌలింగే తీసుకునేవాళ్లమని చెప్పాడు. గంగూలీ, పాంటింగ్‌ల సహకారంతో కెప్టెన్సీలో పలు విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. తమ జట్టులో విదేశీయులుగా హెట్‌ మెయిర్‌, రబాడా, స్టోయినిస్‌, నోర్జేను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, గత సీజన్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈసారి వేలంలో దిల్లీకి బదిలీ  అయ్యాడు. దీంతో ఈ పోరు ఆసక్తిగా మారింది.

పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కరన్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, కృష్ణప్ప గౌతమ్‌, క్రిస్‌ జోర్డాన్‌, షెల్డన్‌ కాట్రెల్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ షమి

దిల్లీ జట్టు: శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రిషభ్‌ పంత్, హెట్‌ మెయిర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్సర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబాడా, అన్‌రిచ్‌ నోర్జే, మోహిత్‌ శర్మ



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని