భర్త ఎంత గొప్పవాడైతే అన్ని కన్నీళ్లు: పూరీ  - Puri Jagannadh about Perfect husband
close
Updated : 14/10/2020 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త ఎంత గొప్పవాడైతే అన్ని కన్నీళ్లు: పూరీ 

పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడు...

హైదరాబాద్‌: ‘జీవితంలో పర్‌ఫెక్ట్‌ తండ్రి ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు.. పర్‌ఫెక్ట్‌ డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ.. పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడు..’ అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ‘పర్‌ఫెక్ట్‌ భర్త’ అనే అంశం గురించి మాట్లాడారు. కాబోయే భర్తపై అంచనాలు ఎంత తక్కువగా ఉంటే.. అంత మంచిదని తెలిపారు.

‘నా భర్త ఇలానే ఉండాలి అనుకుంటే సమస్యల్లో పడిపోతారు. పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందే. జీవితంలో మిమ్మల్ని చాలా మంది ఏడిపిస్తుంటారు. కానీ ఎక్కువగా ఏడిపించే అవకాశం మాత్రం మీ భర్తకే దక్కుతుంది. ఎందుకంటే.. మీ పక్కనే ఉంటాడు. చెప్పి కొన్ని చేస్తాడు, చెప్పకుండా కొన్ని చేస్తాడు.. మీకు కోపం వస్తుంది. అందులో తప్పులేదు.. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. మీ నాన్నను క్షమించినట్లే మీ భర్తను కూడా క్షమించి వదిలేయండి. పక్కింటి వదిన చెప్పే మాటలు విని మీ భర్తతో గొడవపడొద్దు. భర్త ఎంత గొప్ప వాడైతే, భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయి. మగాళ్లు మంచి వాళ్లు కాదు.. అలాగని రాక్షసులు కాదు.. పెళ్లంటేనే సర్దుకుని పోవడం అంతే..’ అని పూరీ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని