ఆ చర్య మంచి సందేశాన్ని పంపదు .. - Quarantine not a good signal opines Supreme Court
close
Published : 05/08/2020 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ చర్య మంచి సందేశాన్ని పంపదు ..

సుప్రీంకోర్టు

దిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసును విచారిస్తున్న బిహార్‌ పోలీస్‌ అధికారిని క్వారంటైన్‌కు పంపడం.. సమాజానికి మంచి సందేశాన్నివ్వదని సుప్రీం కోర్టు బెంచి అభిప్రాయపడింది. ఈ కేసులో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు మేరకు బిహార్‌ పోలీసు బృందం ముంబయి చేరుకుంది. బిహార్‌ పోలీసు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐసీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆయనను బలవంతంగా తరలించారని బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే విమర్శించగా.. తాము కరోనా నిబంధనల ప్రకారమే అలా చేసామని కార్పొరేషన్ తెలిపింది. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి.. కేసును పట్నా నుంచి ముంబయికి తరలించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్ధించిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్‌ తండ్రి తరపు న్యాయవాది మహారాష్ట్ర పోలీసులు ఆధారాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము విచారణ జరుపుతున్న సుశాంత్‌ మృతి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు, విచారణ చేపట్టేందుకు బిహార్‌ పోలీసులకు అనుమతి లేదని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న బిహార్‌  విజ్ఞాపనను ఆమోదిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేస్తూ, నటుడి మృతికేసులో నిజానిజాలను వెలికితీయాలని ఆదేశించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని