
తాజా వార్తలు
RRR:యాక్షన్ సీక్వెన్స్ పూర్తి.. పుణెకు పయనం?
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 50 రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ షెడ్యూల్లో ప్రధానమైన భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు చిత్ర బృందం సోమవారం తెలిపింది. తదుపరి షెడ్యూల్‌కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. షూట్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ పుణె పయనమౌతున్నట్లు సమాచారం. అక్కడ సుమారు వారం రోజులపాటు షూట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడి ఇటీవల హైదరాబాద్ సెట్లో తీసుకున్న సెల్ఫీని షేర్ చేసిన సంగతి తెలిసిందే.
‘ఆర్.ఆర్.ఆర్’లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
