‘RRR‌’: భారీ యాక్షన్ సీన్ ఇలా! - RRR shooting huge action sequence
close
Published : 08/11/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘RRR‌’: భారీ యాక్షన్ సీన్ ఇలా!

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియా భట్‌, ఓలివియా మోరిస్‌ కథానాయికలు.  లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఆసక్తికర వీడియోను పంచుకుంది. భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నామని, థియేటర్లలో వేరే లెవెల్‌లో ఉంటుందని పేర్కొంది.

చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియా భట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని