వలస కార్మికులను ఆదుకోవాలి: ఆరెస్సెస్‌ చీఫ్‌ - RSS chief Mohan Bhagwat seeks focus on jobs for migrants
close
Published : 11/09/2020 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కార్మికులను ఆదుకోవాలి: ఆరెస్సెస్‌ చీఫ్‌

కాన్పుర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విపత్కర కాలంలో ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక నగరమైన కాన్పుర్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా సంఘ్ నాయకులతో పలు విషయాలు చర్చించారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మనవంతు సాయం చేయాల్సిందిగా కోరారు. బుధవారం రాత్రి కాన్పుర్‌కు చేరుకున్న మోహన్ భగవత్ ఆరెస్సెస్‌ ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై నాయకులను ఆరా తీశారు. సంస్థ సేవలు నగరాల్లోని కార్మికులతోపాటు గ్రామాల్లోని రైతుల వరకు చేరాలని ఆయన సూచించారు. సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలని, స్వలాభం కోసమో, ప్రచారం కోసమో పనిచేయొద్దని గుర్తుచేశారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని