close

తాజా వార్తలు

యాక్షన్‌తో అదరగొట్టిన త్రిష

‘రాంగీ’ టీజర్‌ వచ్చేసింది

చెన్నై: ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రమిది. ఎం.శరవణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.మురుగదాస్‌ కథను అందించారు. లైకా ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పై శుభకరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.గతేడాది విడుదలైన ‘96’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి త్రిష. ఇందులో విజయ్‌ సేతుపతికి జంటగా ఆమె కనిపించారు. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం సినీ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్‌ సరసన ‘పేట’ సినిమాలో నటించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.