close

తాజా వార్తలు

పవన్‌ గురించి చెప్పేందుకు మాటలు చాలవు

నెటిజన్లతో రాశీ ఖన్నా ముచ్చట్లు

ఎవర్ని పెళ్లి చేసుకుంటానో..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గురించి చెప్పడానికి మాటలు సరిపోవని అంటున్నారు ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆమె నటించిన ‘వెంకీ మామ’ సినిమా డిసెంబరు 13న విడుదల కాబోతోంది. ఇందులో రాశీ, నాగచైతన్యకు జంటగా నటించారు. ఈ చిత్రంలోనే వెంకటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ మరో జోడీగా సందడి చేయబోతున్నారు. బాబీ దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రాశీ బుధవారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాటిని ఓ సారి చూద్దాం..

వెంకీ మామ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి?
రాశీ: ఎంటర్‌టైనింగ్‌
శివ కార్తికేయన్‌తో కలిసి ఎప్పుడు నటిస్తారు?
రాశీ: త్వరలోనే..
వెంకీ మామ సినిమాలో మీకు నచ్చిన ఫొటోను షేర్‌ చేయండి?
రాశీ: ఈ ఫొటోను షేర్‌ చేశాను.

మహేశ్‌బాబుతో నటించే అవకాశం వస్తే చేస్తారా?
రాశీ: కచ్చితంగా.. ఆయన ఓ సూపర్‌స్టార్‌
మీరు ఏ సినిమాను థియేటర్‌లో ఎక్కువసార్లు చూశారు. అది ఏది?, ఎన్ని సార్లు చూశారు?
రాశీ: నేను నటించిన ‘తొలిప్రేమ’ను ఐదుసార్లు థియేటర్‌లో చూశా.
విజయ్‌ గురించి చెప్పండి?
రాశీ: ఆయనతో కలిసి పనిచేయాలనేది నా కల.
ఈ నెల రాశీ ఖన్నా ఫ్యాన్స్‌కు పండగ. వెంకీమామ, ప్రతిరోజూ పండగే.. ఏ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది?
రాశీ: రెండూ విజయం సాధిస్తాయని ఆశిస్తున్నా.

మీ అభిమానులు?
రాశీ: వారే నా బలం.

రామ్‌ చరణ్‌తో కలిసి ఎప్పుడు నటిస్తారు? మీ కాంబినేషన్‌ను చూడాలని ఎదురుచూస్తున్నాం.
రాశీ: నేను కూడా ఎదురుచూస్తున్నా. త్వరలో జరుగుతుందేమో.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?
రాశీ: పుస్తకాలు చదువుతాను. సినిమాలు చూస్తాను.
అల వైకుంఠపురములో చిత్రం టీజర్‌ ఎలా ఉంది?
రాశీ: చాలా చాలా బాగుంది. స్టైలిష్‌ స్టార్‌ను స్క్రీన్‌పై చూసి చాలా రోజులు అయ్యింది. టీజర్‌లో ఆయన ది బెస్ట్‌గా ఉన్నారు.
ఎన్టీఆర్‌ గురించి ఒక్కమాట?
రాశీ: అసాధారణమైన వ్యక్తి.

అజిత్‌పై మీ అభిప్రాయం?
రాశీ: నవ్వుతో చంపేస్తారు.
రష్మిక గురించి చెప్పండి?
రాశీ: ఆమె క్యూటీ.
టీ లేదా కాఫీ?
రాశీ: టీ.
ఎవర్ని పెళ్లి చేసుకుంటారు?
రాశీ: హుఁ... ఇప్పటి వరకు తెలియదు..
వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జోడీ మాకు మరో సినిమాలో కావాలి.
రాశీ: చూద్దాం..
వెంకీ మామను తొలిరోజు ఎక్కడ చూస్తారు? (సురేష్‌ ప్రొడక్షన్స్‌ ట్వీట్‌)
రాశీ: ఎంతో ఉత్సాహంగా ఉండే నా చిత్ర బృందంతో కలిసి చూస్తాను. ఇకపోతే ఎక్కడ, ఎప్పుడు అనే విషయాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ చెప్పాలి (నవ్వుతూ).
డార్లింగ్‌ ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పండి?
రాశీ: ఆయన తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.

ఈ ఫొటోలో పాయల్‌ రాజ్‌పుత్‌కు ఏం చెబుతున్నారు?
రాశీ: అది రహస్యం (నవ్వుతూ).
పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్కమాట?
రాశీ: ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయన ఓ లెజెండ్‌.
సమంతపై మీ అభిప్రాయం?
రాశీ: నా అభిమాన నటి.

వెంకీ, చైతన్యతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
రాశీ: అద్భుతం. వాళ్లిద్దరు నిజంగా జెంటిల్‌మెన్స్‌.

చైతన్య?.. వెంకీ?..నాని..?
రాశీ: చైతన్య స్వీట్‌. వెంకీ డ్యాషింగ్‌. నానితో కలిసి పనిచేయాలని వెయిటింగ్‌.
మీరు సినిమాకు సంతకం చేసే ముందు కథను చూస్తారా?, పాత్రకు ప్రాధాన్యం ఇస్తారా?
రాశీ: పాత్ర నాకు ముఖ్యం.
చిన్నతనంలో రాశీ ఎలా ఉండేది?
రాశీ: చాలా మంచిదాన్నట. అమ్మ చెబుతుంటుంది.

తెలుగు బాగా నేర్చుకున్నారు. శిక్షణ తీసుకున్నారా?
రాశీ: మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసింది.
ఫ్యాంటసీ, హారర్‌.. ఏ సినిమాను ఎంచుకుంటారు?
రాశీ: ఫ్యాంటసీ.
వందల సార్లు చూసినా మీకు బోర్‌ కొట్టని సినిమా?
రాశీ: ది ప్రపోజల్‌. నాకు చాలా ఇష్టమైన చిత్రమిది.
విజయ్‌ దేవరకొండ గురించి చెప్పండి?
రాశీ: ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చాలా నైపుణ్యం ఉన్న నటుడు.
మీకు ఇష్టమైన ప్రదేశం?
రాశీ: లండన్‌.
వెంకీ మామ షూటింగ్‌ సమయంలో వెంకటేష్‌ నుంచి ఏం నేర్చుకున్నారు?
రాశీ: ఆయన ఓ పుస్తకం లాంటి వారు. నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మాటల్లో చెప్పలేను.

 Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.