మోదీజీ.. ఇకనైనా చెప్తారా: రాహుల్‌ గాంధీ - Rahul Gandhi hopes clarity about corona vaccine will be given today
close
Updated : 04/12/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీజీ.. ఇకనైనా చెప్తారా: రాహుల్‌ గాంధీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికైనా వెల్లడవుతాయని కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉచిత కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతీ భారతీయుడికీ ఎప్పుడు లభించనుందీ కనీసం నేటి సమావేశంలోనైనా వెల్లడి కాగలదని ఆశిస్తున్నట్టు రాహుల్‌ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ట్వీట్‌లో ‘‘నేడు జరగనున్న అఖిల పక్ష సమావేశంలోనైనా ప్రధాన మంత్రి ప్రతి భారతీయుడికీ ఉచిత కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు లభించేదీ వివరణ ఇవ్వగలరని అశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కొవిడ్‌ టీకాకు సంబంధించి ప్రధాని, ప్రభుత్వం, భాజపా నేతలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని రాహుల్‌ ఇటీవల విమర్శించారు. అసలు ఉచిత టీకాలపై మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని