ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి - Rahul Questions About 2Croe Jobs Per Year
close
Published : 09/08/2020 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి

ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు

దిల్లీ: ఏడాదికి రెండు కోట్లమందికి ఉద్యగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత కొద్దిరోజులుగా ప్రధాని మోదీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆయన ఆదివారం మరోమారు నిరుద్యోగంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ‘రోజ్‌గార్‌ దో’ (ఉద్యోగాలు ఇవ్వండి) పేరుతో వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘‘నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయినప్పుడు, దేశంలోని యువతకు ప్రతి ఏడాది రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు.అయితే ఆయన వారి కలలను అమ్మేశారు. నిజం ఏంటంటే ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు. ఎందుకిలా జరిగిందంటే..నోట్ల రద్దు, జీఎస్‌టీ, కరోనా వైరస్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ వంటి తప్పడు విధానాల వల్లనే. ఈ మూడింటి కారణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ నాశమయింది. మరో నిజం ఏంటంటే.. భారత్ తన దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోజ్‌గార్‌ దో పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగాన్ని ఆయన కోరారు. రాహుల్ గాంధీ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిసిస్తూ వీడియోనే తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఉపాధి పొందండం అనేది యువత హక్కు. అప్పుడే దేశం, యువత పురోగతి సాధిస్తారు’’ అని  పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని