రజనీ ఆరోగ్యంపై అపోలో తాజా బులెటిన్‌ - Rajanikanth Latest Health bulletin
close
Updated : 26/12/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ ఆరోగ్యంపై అపోలో తాజా బులెటిన్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. రజనీకాంత్‌ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు శనివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు. బీపీ హెచ్చు తగ్గుల కారణంగా రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 

రజనీ త్వరగా కోలుకోవాలి: కమల్‌ హాసన్‌

‌రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ స్పందించారు. రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కమల్‌హాసన్‌ ఆకాంక్షించారు. 

 

ఇదీ చదవండి..

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌

రజనీ ఆస్పత్రిలో చేరారని తెలిసి బాధపడ్డా: పవన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని