దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రాజస్థాన్‌ - Rajasthan vs delhi toss
close
Updated : 09/10/2020 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రాజస్థాన్‌

షార్జా: యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగ్‌ రసవత్తరంగా సాగుతోంది. షార్జా వేదికగా నేడు రాజస్థాన్‌, దిల్లీ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచులాడి నాలుగు గెలిచిన శ్రేయస్‌ సేన జోరుమీద కనిపిస్తోంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచుల్లో వరుసగా మూడు ఓడిన రాజస్థాన్‌ విజయం కోసం పరితపిస్తోంది. తమకు అచ్చొచ్చిన షార్జాలో తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది.

రాజస్థాన్‌ జట్టు: యశస్వీ జైస్వాల్‌,  జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌, మహిపాల్‌ లోమ్రర్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, ఆండ్రూ టై, శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, వరుణ్ ఆరోన్‌

దిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, మార్కస్‌ స్టాయినిస్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, కాగిసో రబాడ, ఆన్రిచ్‌ నార్జెమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని