close

తాజా వార్తలు

రజనీ-కమల్‌ కలిసి నటిస్తారా..?

చెన్నై: రజనీకాంత్‌- కమల్‌హాసన్‌.. ఒకరు సూపర్‌స్టార్‌, మరొకరు విశ్వనటుడు. ప్రపంచవ్యాప్తంగా వీరికి లక్షలాది మంది అభిమానులున్నారు. గతంలో వీరిద్దరు స్టార్‌లు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మళ్లీ తమ అభిమాన అగ్రహీరోలిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఎందరో అభిమానులు ఆశపడుతున్నారు. ఈ తరుణంలో ఓ సినిమా కోసం కమల్‌-రజనీ కలిసి పనిచేయనున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేం లోకేష్‌ కనకరాజు దర్శకత్వం వహించనున్నారట. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. మరోవైపు కమల్‌ కూడా ‘భారతీయుడు 2’ చిత్రంతో తీరిక లేకుండా ఉన్నారు. ఆ సినిమా తర్వాత కమల్‌ ‘తలైవన్‌ ఇరుకిరాన్‌’ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు కమల్‌ హాసన్‌నే దర్శకత్వం వహించనున్నారు. ఈ తరుణంలో మరి ఆ ఇద్దరూ కలిసి నటిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.