వైరల్‌గా మారిన రకుల్‌ హాలీడే‌ ఫొటోలు - Rakul Holiday pics Goes Viral In Internet
close
Published : 21/11/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరల్‌గా మారిన రకుల్‌ హాలీడే‌ ఫొటోలు

బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌తో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తారలు తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారితో కలిసి గోవా, మాల్దీవులు, దుబాయ్‌ ప్రాంతాలకు టూర్‌ వెళ్తున్నారు. తాజాగా నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సైతం తన కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.

టూర్‌లో భాగంగా సముద్రతీరంలో ఆమె సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆమె సూర్యోదయం సమయంలో బీచ్‌లో యోగాసనాలు వేశారు. ‘‘సముద్రం వద్ద విటమిన్‌ ‘డీ’ని పొందడం కోసం ఇలా..’’ అని రకుల్‌ పేర్కొన్నారు. సముద్ర తీరంలో కూర్చొన్న మరో ఫొటోని షేర్‌ చేస్తూ.. ప్రతిక్షణం నవ్వుతూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించాలనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ప్రసుత్తం రకుల్‌ హాలీడే ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, రకుల్‌ టూర్‌కు సంబంధించిన పలు ఫొటోలు మీరూ చూసేయండి..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని