రకుల్‌కి కొవిడ్‌-19 నెగటివ్‌..! - Rakul Preet Singh says she tested negative for coronavirus
close
Published : 12/09/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌కి కొవిడ్‌-19 నెగటివ్‌..!

ఆ విషయం ముందే తెలుసుంటే ఫ్లైట్‌ ఎక్కేదాన్ని కాదు: నటి

హైదరాబాద్‌: ఇటీవల తాను కరోనా టెస్టు‌ చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యిందని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ తెలిపారు‌. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దీంతో నటీనటులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సైతం తన తదుపరి బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా అర్జున్‌కపూర్‌తో కలిసి నటించేందుకు ముంబయికి చేరుకున్నారు. కానీ అర్జున్‌కపూర్‌ కొవిడ్‌ బారినపడడంతో సదరు చిత్రబృందం షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసింది.

‘నా తదుపరి బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ నెలలో అర్జున్‌కపూర్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. షూటింగ్‌ కోసం ముంబయికి రావడానికి ముందు కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగటివ్‌ అని తెలిసింది. దీంతో నేను ముంబయి పయనమయ్యాను. విమానం ఎక్కిన కొద్ది సమయానికే అర్జున్‌కి కరోనా పాజిటివ్‌ అని, షూటింగ్‌ కొద్దికాలంపాటు నిలిపివేస్తున్నామని చిత్రబృందం నుంచి సమాచారం అందింది. ఒకవేళ ఇదే విషయం ఒక అరగంట ముందు తెలిసి ఉంటే నేను ముంబయికి వచ్చేదాన్ని కాదు. బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ క్యాన్సిల్‌ కావడంతో హైదరాబాద్‌ వెళ్లి నా తదుపరి తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను. అర్జున్‌కపూర్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నాను. తను ఇప్పుడు కోలుకుంటున్నాడు’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని