ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌ - Rakul Preet and Krish open up about controversies
close
Updated : 15/12/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై వస్తున్న పుకార్లను టాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కొట్టిపారేసింది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ‘సామ్‌జామ్‌’ కార్యక్రమంలో ఆమె అతిథిగా పాల్గొంది. దానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.

కాలేజీ రోజుల్లోనే స్కూటీ రైడ్‌లకు ఛార్జీ వసూలు చేసేదానివట అని సమంత అడగ్గా.. ‘ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్‌ అంటే నాకు చాలా ఇష్ట’మని ఆమె బాహాటంగానే చెప్పేసింది. ఆ తర్వాత.. మీడియా, సోషల్‌మీడియాలో మీపై వస్తున్న వార్తలపై ఎందుకు స్పందించరు..? అని సమంత అడిగిన ప్రశ్నకు రకుల్‌ స్పందిస్తూ.. ‘మనపై పుకార్లు పుట్టించేవారు ఒక్కక్షణం కూడా మనగురించి  ఆలోచించరు. నేను ఉంటున్న ఇల్లు కూడా ఎవరో ఒక వ్యక్తి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారు. ఎవరో నాకు ఇల్లు ఇస్తే.. మరి నేను పని చేయడం దేనికి..? ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. అందుకే వాటిని నేను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను. మన పని మాత్రమే మాట్లాడుతుంది’ అని ఆమె స్పష్టం చేసింది.

ఇదీ చదవండి..

ఈ ప్రయాణం ఎంతో అందమైంది: రకుల్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని