రకుల్‌కు కరోనా పాజిటివ్‌ - Rakul preetsingh tested Corona positve
close
Updated : 22/12/2020 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కరోనాకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆమె చెప్పింది. త్వరలోనే కోలుకొని సినిమా షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేసింది. ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరింది.
ఈమధ్య బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో అక్కడే బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోందామె. మరో తెలుగు చిత్రానికి కూడా ఓకే చెప్పింది. వీటితో పాటు ఆమె చేతిలో మూడు హిందీ, రెండు తమిళ సినిమాలున్నాయి. ఇండియన్‌2లోనూ ఆమె నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ఓ ప్రముఖ ఓటీటీ నిర్వహిస్తున్న టాక్‌షోలో ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని