చిరు గొప్ప వ్యక్తి.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు: శివ - Ram Charan also has a full length role in Acharya with Chiranjeevi Says Koratala Siva
close
Updated : 16/12/2020 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు గొప్ప వ్యక్తి.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు: శివ

‘ఆచార్య’లో చరణ్‌ అతిథి కాదు.. కీలకం

హైదరాబాద్‌: ‘ఆచార్య’.. మెగా అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సందడి చేయనున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ తక్కువ నిడివి గల అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొరటాల శివ.. ‘ఆచార్య’కు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలను బయటపెట్టారు. మొదటిసారి చిరంజీవితో కలిసి పనిచేయడం, సినిమాలో చరణ్‌ పాత్ర, లాక్‌డౌన్‌ షూటింగ్‌... ఇలా పలు అంశాల గురించి వివరించారు.

‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలాకాలం విరామం తర్వాత తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం నియమ నిబంధనలను పాటిస్తూ షూట్‌ చేయడం విభిన్నంగా అనిపిస్తోంది. అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌ చేయడం మంచిదే’

‘మెగాస్టార్‌ చిత్రాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తుంటే నా కల సాకారమైనట్లు ఉంది. మా సినిమా ప్రారంభమైనప్పుడు ఆయన ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఆయన స్టార్‌ హీరో అని మనందరికీ తెలుసు. మెగాస్టార్‌ ఇంతమంది ప్రేమాభిమానాలు పొందడానికి గల కారణమేమిటో ఆయనతో కలిసి పనిచేసినప్పుడే అర్థమవుతుంది. ప్రతి షాట్‌, సీన్‌ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు. ఆయనకి అద్భుతైమన జ్ఞాపకశక్తి ఉంది. పనిపట్ల అంకితభావం, ఉత్సుకత కనబరిచే ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం ఎంతో తేలిక. ఫలితం కూడా మంచిగానే ఉంటుంది’

‘‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మెగా అభిమానులందరికీ ట్రీట్‌ కానుంది. ఇందులో చెర్రీ పూర్తిస్థాయి పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. తండ్రీకొడుకులిద్దరితో ఒకేసారి కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రేక్షకుల్ని అలరిస్తానని ఆశిస్తున్నా. ఒకే ఫ్రేమ్‌లో వాళ్లిద్దర్నీ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని కొరటాల శివ వెల్లడించారు.

ఇవీ చదవండి
మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి..!

మళ్లీ సినిమాల్లోకి రాను: రాజా
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని