చరణ్‌ రికార్డు.. నం.1 ఆయనే..! - Ram Charan garners one Million followers in record time
close
Published : 10/11/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌ రికార్డు.. నం.1 ఆయనే..!

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ కాలంలో ట్విటర్‌లో మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా నిలిచారు. కేవలం 233 రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు కథానాయకుడు రామ్‌ చరణ్‌ అని తెలిసింది. టాలీవుడ్‌లో ఇంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్స్‌ను ఏ స్టార్‌ సాధించలేదట. చరణ్‌ ఈ ఏడాది మార్చిలో ట్విటర్‌ ఖాతా ఆరంభించారు. ఆయన్ను 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. చెర్రీ మాత్రం కేవలం ఇద్దర్ని మాత్రమే అనుసరిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. ఆయన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్‌ కల్యాణ్‌.

‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు సంతకం చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో చెర్రీ అతిథిగా సందడి చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ‘నా తండ్రి కోసం ‘సైరా’ను నిర్మించా. నన్ను, నాన్నను ఒకే తెరపై చూడాలనేది అమ్మ కోరిక. ఆమె కోసం ‘ఆచార్య’లో నటించబోతున్నా’ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని