పవన్‌కు పిలుపునకు రామ్‌ చరణ్‌ మద్దతు - Ram charan supports for Pawan Lighting lamp programme
close
Published : 12/09/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కు పిలుపునకు రామ్‌ చరణ్‌ మద్దతు

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధమైన ఘటన నేపథ్యంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దీపాలు వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన ‘దీపాలు వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం - మత సామరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు.

పవన్‌ ఇచ్చిన ఈ పిలుపునకు పలువురు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, హరీశ్‌ శంకర్‌, తదితరులతో పాటు జనసేన వీర మహిళలు, పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తులసి కోటకు చిరంజీవి సతీమణి సురేఖ పూజ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ విశాఖ బీచ్‌ రోడ్‌లో కాళికా మాత ఆలయం వద్ద దీపాలు వెలిగించారు. అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనసేన వీర మహిళలు, పార్టీ నేతలు దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమానికి భాజపా నేతలు కూడా మద్దతు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని