రాజమౌళి.. ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి:వర్మ - Ram gopal Varma asks s s rajamouli to release RRR trailer pay and view system
close
Published : 20/07/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమౌళి.. ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి:వర్మ

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సినిమాల జోరు పెంచారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు షూటింగ్‌లు జరుపుకొంటున్నాయి. అయితే, రాంగోపాల్‌ వర్మ మాత్రం ఒక దాని తర్వాత ఒకటి వరుస చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. ఇటీవల ‘క్లైమాక్స్‌’, ‘నేక్డ్’, ‘కరోనా వైరస్‌’ వంటి చిత్రాలను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు ‘‘ పవర్ స్టార్’’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్‌లైన్‌కు మారుతోంది. ఈ  పరిస్థితుల్లో అదే సరికొత్త మార్కెట్. ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి. మేమంతా ‘ఆర్ఆర్ఆర్’ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ పై ఇంకా రాజమౌళి స్పందించలేదు.
గతంలోనూ వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ నడిచిన సంగతి తెలిసిందే. అవన్నీ నెటిజన్లను అలరించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని