close
Array ( ) 1

తాజా వార్తలు

డబుల్‌ యాక్షన్‌.. డబుల్‌ థ్రిల్‌

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో రామ్‌ పోతినేని విజయాల దాహాన్ని తీర్చుకున్నాడు. మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ద్వారా రామ్‌ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు. మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘రెడ్‌’ అనే టైటిల్‌ కూడా ఖరారైంది. ఫిబ్రవరి 28న చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి రామ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశాడు. అందులో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సూచించే రెండు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్నాడు. ‘ఈసారి.. డబుల్‌ యాక్షన్‌.. డబుల్‌ థ్రిల్స్‌కు సిద్ధంకండి. ఫిబ్రవరి 28న టీజర్‌తో మీ ముందుకు వస్తున్నా’ అంటూ రామ్‌ పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నివేధా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలు. ఈ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా.. రామ్‌, తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.