నిర్మాతగా ‘ఆచార్య’ సెట్‌లో రామ్‌చరణ్‌! - RamCharan In Acharya Set
close
Published : 27/12/2020 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాతగా ‘ఆచార్య’ సెట్‌లో రామ్‌చరణ్‌!

ఫొటోలు షేర్‌ చేసిన టీమ్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సెల్వరాజన్‌ వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

తాజాగా ‘ఆచార్య’ సెట్‌లోకి రామ్‌చరణ్‌ తేజ్‌ అడుగుపెట్టారు. దర్శకుడు కొరటాల శివ, ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌తో సరదాగా మాట్లాడారు. సురేశ్‌ క్రియేట్‌ చేసిన సెట్‌ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆర్ట్‌ డైరెక్టర్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సర్‌.. సెట్‌ గురించి మీ ప్రశంసలు నాకెంతో విలువైనవి. నేను మరింత శ్రమించేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని సురేశ్‌ పేర్కొన్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రామ్‌చరణ్‌ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఈ సినిమాలో చెర్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇవీ చదవండి

చిరు సర్‌.. ఇబ్బందిపడ్డారు: సోనూసూద్‌

ఆచార్యలో జిగేలు రాణి?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని