మేనకోడలితో చరణ్‌ డ్యాన్స్‌ - Ramchan dance with his nephew Navishka video goes viral
close
Published : 04/08/2020 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేనకోడలితో చరణ్‌ డ్యాన్స్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వచ్చి ఖాళీ సమయాన్ని యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తన సోదరి శ్రీజ కుమార్తె నవిష్కతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘డ్యాన్స్‌ విత్‌ డార్లింగ్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు

చిన్నారులు అలరించే పాటకు నవిష్కతో పాటు డ్యాన్స్‌ చేస్తూ తెగ సంబర పడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకుంటోంది. గతంలోనూ నవిష్కతో కలిసి చిరంజీవి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. కరోనా వైరస్‌ కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా పడింది. మరోవైపు రాజమౌళితో సహా ఆయన కుటుంబం కరోనా బారిన పడటంతో ఈ ప్రాజెక్టు తిరిగి మొదలు కావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని