ప్రభాస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన చెర్రీ - Ramcharan Accepts Green India Challenge
close
Published : 08/11/2020 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన చెర్రీ

హైదరాబాద్‌: తన స్నేహితుడు, నటుడు ప్రభాస్‌ విసిరిన ఛాలెంజ్‌ను రామ్‌చరణ్‌ స్వీకరించారు. ఈ మేరకు చరణ్‌ మొక్కలు నాటే యజ్ఞం ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి చెర్రీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మొదలుపెట్టిన నా స్నేహితుడు ప్రభాస్.. ఈ ఛాలెంజ్‌తో నన్ను కూడా భాగం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ  భూమ్మీద మనగడ సాగించగలం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షలమందిని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

అనంతరం, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ నటి ఆలీయా భట్‌తోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్వీకరించి మొక్కలు నాటాలని చరణ్‌ కోరారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని