ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు: రామ్‌చరణ్‌ - Ramcharan Condolences To The Three Fans Who Unfortunately lost their lives
close
Published : 02/09/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు: రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన అభిమానుల మృతి పట్ల నటుడు రామ్‌చరణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీటర్‌ ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని రామ్‌చరణ్‌ తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబానికి వ్యక్తిగతంగా తాను రూ.2.5లక్షలు ఆర్థికసాయం చేయనున్నట్లు రామ్‌చరణ్‌ ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..
బుధవారం సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజేంద్ర (31), సోమశేఖర్‌ (29), అరుణాచలం (20) మృతి చెందిన విషయం తెలిసిందే. అభిమానుల మృతి పట్ల ‘వకీల్‌సాబ్‌’ చిత్ర బృందం సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించనున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపింది. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అభిమానులంతా తమ జీవితాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా చిత్ర బృందం సూచించింది.

పవన్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బుధవారం పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని