ఆర్‌ఆర్‌ఆర్‌: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - Ramcharan and ntr RRR will come on October 13 this year
close
Published : 25/01/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఆర్‌ఆర్‌: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

చిత్రబృందం అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను పంచుకుంది. గుర్రంపై రామ్‌చరణ్‌, వెలోసెట్‌పై ఎన్టీఆర్‌లు దూసుకుపోతున్న పోస్టర్‌ అభిమానులను అలరిస్తోంది.

‘అక్టోబరు 13న నీరు-నిప్పు కలిసి వస్తున్నాయి. ఆ శక్తిని ఇంతకు ముందెప్పుడూ మీరు చూసి ఉండరు. భారతీయ సినిమాలో అతి పెద్ద కలయిక అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు వస్తోంది’-ట్విటర్‌లో ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌

పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. చెర్రీ సరసన సీత పాత్రలో ఆమె మెప్పించనున్నారు. తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి

30 ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని