ఇద్దరు రవితేజలతో డబుల్‌ ట్రీట్‌ - Ramesh varma special interview
close
Published : 22/08/2020 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు రవితేజలతో డబుల్‌ ట్రీట్‌

‘‘ఇది హిట్టు, అది ప్లాప్‌ అని ఎవరూ ముందే చెప్పలేరు. దర్శకుడనే కాదు.. నటులు, టెక్నీషియన్‌ విజయవంతమైన చిత్రం తీయాలనే కష్టపడతారు.’’ అన్నారు దర్శకుడు రమేష్‌ వర్మ. గతేడాది ‘రాక్షసుడు’ చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా  మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు రమేష్‌ వర్మ.

* ‘‘ఈసారి పండగ ఇంట్లోనే మా పిల్లలతో కలిసి జరుపుకొంటా. ప్రతి బర్త్‌డేకి స్నేహితులతో గడపడం, పార్టీలు వంటి సందడి ఉండేది. ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లో ఉండటమే సురక్షితం.

* ఈ విరామ సమయాన్నంతా స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకోవడానికే కేటాయించా. రవితేజ చిత్రానికి పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధమైంది. ఇది కాక నా దగ్గర మరో ఏడు కథలున్నాయి. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ప్రేక్షకులంతా ప్రపంచ సినిమాకు అలవాటు పడ్డారు. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాలు చూసేస్తున్నారు. ఫలితంగా వాళ్ల అభిరుచుల్లోనూ మార్పులొస్తున్నాయి. ఇకపై మనం చూపించేది ఏదైనా విశ్వజనీనమైన కథగానే ఉండాలనేది నా అభిప్రాయం.

* రవితేజతో తీయనున్న కథ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చక్కటి యాక్షన్‌ క్రైం థ్రిల్లర్‌. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు కథానాయికలు ఉంటారు. ‘కిలాడీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. 

* తెలుగు నుంచి వెబ్‌సిరీస్‌ చేసి పెట్టమని ఎవరూ అడగలేదు. హిందీలో ‘హాట్‌స్టార్‌’ కోసం రెండు సిరీస్‌లు చేయాల్సి ఉంది. మా సంస్థలో దీన్ని నిర్మిస్తాం. దీనిపై వచ్చే జనవరిలో ప్రకటన వచ్చే అవకాశముంది. ఒక వెబ్‌సిరీస్‌కు నేను కథ సిద్ధం చేస్తున్నా’’.

* ‘రాక్షసుడు’ను బాలీవుడ్‌లో తీసే ఆలోచన ఉంది. పలువురు బాలీవుడ్‌ కథానాయకులు నన్ను సంప్రదించారు. రవితేజ చిత్రం తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కించే అవకాశముంది. ‘రాక్షసుడు’కు సీక్వెల్‌ తీసుకురావాలన్న ఆలోచన ఉంది.’

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని