‘రమ్యకృష్ణ.. నిజంగా నమ్మలేకపోతున్నాం..!’ - Ramya krishnan birthday wishes
close
Published : 16/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రమ్యకృష్ణ.. నిజంగా నమ్మలేకపోతున్నాం..!’

నటి పుట్టినరోజు.. నెటిజన్ల కామెంట్లు

హైదరాబాద్‌: ఒకప్పుడు కథానాయికగా వరుస సినిమాలతో అలరించిన నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఆమె దాదాపు 260 చిత్రాల్లో నటించారు. రమ్యకృష్ణ మంగళవారం తన 50వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమె జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ‘శివగామి’ కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టానంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే రమ్యకృష్ణ అభిమానులు చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. నటి వయసు 50 ఏళ్లంటే నమ్మలేకపోతున్నామంటూ పోస్ట్‌లు చేశారు. ‘50 ఏళ్లా..!, మీరు నిజమే చెబుతున్నారా?, ఏ మాత్రం అలా లేరు, చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు.

రమ్యకృష్ణకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తదితరులు విష్‌ చేశారు. ‘రోజ్‌ రోజ్‌ పువ్వు నుంచి మమతల తల్లి వరకు.. ఇన్నాళ్లే మన ప్రయాణం ఓ అద్భుతం. నువ్వు మరిన్ని చక్కటి పాత్రలతో ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించాలని ఆశిస్తున్నా. నా ప్రియమైన, అందమైన రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు.

‘నాకెంతో ఇష్టమైన, ఎవర్‌గ్రీన్‌ రమ్యజీకి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటిలాగే మాకు వినోదం పంచుతూ ఉండాలని కోరుకకుంటున్నా’ అని పూరీ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని