రషీద్‌ఖాన్‌ రికార్డు బౌలింగ్‌ - Rashid Khan bowls most economical spell of 2020
close
Published : 28/10/2020 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రషీద్‌ఖాన్‌ రికార్డు బౌలింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ స్పిన్‌ అస్త్రం రషీద్‌ఖాన్‌ మరోసారి తన సత్తా చాటాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు మూడుచెరువుల నీళ్లు తాగించాడు. మంగళవారం రాత్రి దిల్లీ, హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారీ స్కోరు నమోదు చేసింది. 220 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దిల్లీకి హైదరాబాద్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. రషీద్‌ఖాన్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌కు మించి ప్రయత్నించలేదంటే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డులు నమోదు చేశాడు.

రషీద్‌ బౌలింగ్‌ సాగిందిలా..
మొదటి ఓవర్‌ - W 0 1 0 W 0
రెండో ఓవర్‌ - 0 0 0 1 1 0
మూడో ఓవర్‌ - 0 1 0 1 0 1
నాలుగో ఓవర్‌ - 0 1 0 0 W 0

(రషీద్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 17 డాట్‌ బాల్స్‌ వేయడంతో పాటు ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం)

రషీద్‌ఖాన్‌.. 4 ఓవర్లు వేసి అతి తక్కువ పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకంటే ముందు 2009లో నెహ్రా(1/6), అదే ఏడాది ఎడ్వర్డ్స్‌(0/6), 2019లో చాహల్‌(1/6), 2011లో రాహుల్‌శర్మ(2/7), 2017లో ఫెర్గూసన్‌(1/7), 2020లో రషీద్‌ఖాన్‌(3/7) గణాంకాలు నమోదు చేశాడు. 2020 సీజన్‌లో మాత్రం రషీద్‌ఖాన్‌దే అత్యుత్తమం. ఇదే సీజన్‌లో దిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లోనూ రషీద్‌ 3/13 చెలరేగిపోయాడు. దిల్లీపై రెండు మ్యాచుల్లో కలిపి 8 ఓవర్లు వేసిన రషీద్‌ఖాన్‌ 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ ధాటికి దిల్లీ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ చేరారు. ఈ మ్యాచ్‌తో వార్నర్‌సేన తన కెరీర్‌లో రెండో అతిపెద్ద భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని