ప్రతి రిలేషన్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు..! - Rashmi And Sudheer About Their Relationship
close
Published : 18/10/2020 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి రిలేషన్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు..!

మరోసారి డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేసిన సుధీర్‌-రష్మి

హైదరాబాద్‌: సుధీర్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా నటి రష్మి స్పందించారు. ‘ప్రతి రిలేషన్‌షిప్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు’ అని ఆమె అన్నారు. రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ కామెడీ షో తాజాగా 300 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ టీమ్‌ సెట్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి చెప్పమని సుధీర్‌-రష్మిలను అభిమానుల తరఫు నుంచి రోజా కోరారు. రోజా అడిగిన ప్రశ్నతో సిగ్గుపడిన ఈ జంట అనంతరం తమ మధ్య ఉన్న అనుబంధం గురించి స్పందించారు. ‘ఏడేళ్ల నుంచి మనందరం కలిసి ప్రయాణిస్తున్నాం. మనందరం ఒక ఫ్యామిలీ. అనుకోకుండా మా ఇద్దరి గురించి ఒక ట్రాక్‌ స్టార్ట్‌ అయ్యింది. అది అలా కొనసాగుతోంది. ఆన్‌స్ర్కీన్‌లో నాకు ఏదైనా పేరు వచ్చిందంటే దానికి ఒక కారణం రష్మి. సుధీర్‌-రష్మి అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు కానీ ఎనిమిదేళ్లుగా నా విజయం నా పక్కనే ఉంది. థ్యాంక్యూ సో మచ్‌ రష్మి’ అని సుధీర్‌ చెప్పి సిగ్గుపడతారు.

సుధీర్‌ చెప్పిన మాటతో ఆనందించిన రష్మి మాట్లాడుతూ.. ‘మన ప్రయాణం ఎనిమిదో సంవత్సరంలోకి  అడుగుపెడుతోంది. అయితే ఏదో ఒక సమయంలో మనకి బయట స్నేహితులకంటే ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులే బాగా క్లోజ్‌ అవుతారు. మేమిద్దరం పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకోగలిగాం. మా ఇద్దరి గురించి ఏమైనా చెప్పాలంటే.. ప్రతి రిలేషన్‌షిప్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్‌షిప్‌లు అంతే..!’ అని చెప్పారు. అనంతరం సుధీర్‌-రష్మి మరోసారి తమ డ్యాన్స్‌తో స్టేజ్‌పై మేజిక్‌ చేశారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని