ఆ హీరోతో ప్రేమపై రష్మిక రియాక్షన్‌ - Rashmika about her relationship status
close
Published : 09/09/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరోతో ప్రేమపై రష్మిక రియాక్షన్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో జోరుమీదున్న కథానాయిక రష్మిక. ఆమె చిత్ర పరిశ్రమకు చెందిన ఓ కథానాయకుడితో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రష్మిక స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని స్పష్టం చేశారు. ‘నాకు తెలిసిన ప్రతి అబ్బాయి పక్కన నా పేరు పెట్టే వారికి ఇదే నా సమాధానం. నేను సింగిల్‌గా ఉన్నా.. నాకు ఇలా ఒంటరిగా ఉండటం నచ్చింది. సింగిల్‌గా ఉన్నామని బాధపడే వారికి ఇదే నా సలహా.. జీవితంలో ఒంటరిగా, ఆనందంగా ఉండటం తెలుసుకుంటే.. మనకు కాబోయే జీవిత భాగస్వామిపై కూడా అంచనాలు ఇంకా పెరుగుతాయి’ అని ఆమె పేర్కొన్నారు.

రష్మిక ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆమె చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. అదేవిధంగా ఆమె కోలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయబోతున్నారు. కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘సుల్తాన్‌’లో.. ఆయన సరసన కనిపించబోతున్నారు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నట్లు సమాచారం. మరోపక్క రష్మిక కన్నడ సినిమా ‘పొగరు’లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని