వెబ్‌ సిరీస్‌లో రవీనా - Raveena Tandon to start filming for debut web series in Dalhousie
close
Published : 10/10/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెబ్‌ సిరీస్‌లో రవీనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అలనాటి నటి రవీనా టండన్‌ తొలిసారి వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. బాలీవుడ్‌ చిత్రాల్లో తనదైన ముద్రవేసిన ఆమె వెబ్‌ సిరీస్‌లో నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘‘వెబ్‌ సిరీస్‌కు పనిచేసే సాంకేతిక నిపుణులు, సిబ్బంది ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌కు చేరుకున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతాం. నేను షూటింగ్‌లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నాను. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మా బృందం అన్ని రకాల చర్యలు తీసుకొంటోంది. కొవిడ్‌ విలయ తాండవం చేస్తుండటంతో పరిశుభ్రతపై నేను కచ్చితంగా ఉన్నా. నాతో సహా బృందమంతా సామాజిక  దూరం పాటిస్తూ చిత్రికరణ జరపాలని నిర్ణయించుకున్నాం’’అని రవీనా అన్నారు. ప్రస్తుతం ఆమె ‘కేజీఎఫ్‌2’లో కీలక పాత్రలో నటిస్తున్నారు.


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని