రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదముంది   - Ravis Shastri says the reason behind not selecting Rohit Sharma for Australia tour
close
Updated : 02/11/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదముంది  

అందుకే సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు

దుబాయ్‌: సరైన ఫిట్‌నెస్‌ లేకపోవడం వల్లే రోహిత్‌ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు ఎంపిక చేయలేదని టీమ్‌ ఇండియా కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడు. రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ వైద్య బృందం నివేదిక ఇచ్చిందని, పునరాగమనానికి తొందరపడొద్దని అతడికి సూచించిందని తెలిపాడు. తొడకండరాల గాయం కారణంగా జట్టుకు ఎంపిక కాని రోహిత్‌.. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ కనపడడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే సెలక్టర్లు రోహిత్‌ వైద్య నివేదికను చూశాకే అతణ్ని జట్టులోకి తీసుకోవద్దని నిర్ణయించారని రవిశాస్త్రి తెలిపాడు. ‘‘ఇందులో మా ప్రమేయమేమీ లేదు. వైద్య బృందం సెలక్టర్లకు నివేదిక సమర్పించింది. సెలక్టర్లు తమ పని తాము చేశారు. ఇందులో నా పాత్రేమీ లేదు. నేను ఎంపిక ప్రక్రియలో భాగం కాదు. రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదముందని నివేదికలో ఉందని మాత్రమే నాకు తెలుసు’’ అని చెప్పాడు. పునరాగమనం కోసం రోహిత్‌ తొందరపడొద్దని, ఒకప్పుడు తాను చేసిన తప్పును చేయొద్దని అన్నాడు. ‘‘1991లో నా కెరీర్‌ ముగిసింది. అప్పుడు నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లా. వెళ్లాల్సింది కాదు. 3-4 నెలల విరామం తీసుకుని ఉంటే మరో అయిదేళ్లు భారత జట్టుకు ఆడేవాణ్ని. కాబట్టి నేను అనుభవంతో చెబుతున్నా. అప్పుడు వైద్యులు పర్యటనకు వెళ్లొద్దని నాకు సూచించారు. కానీ నేను దురాశతో వ్యవహరించా. ఫామ్‌లో ఉన్న నేను చాలా ఉత్సుకతతో వెళ్లా. రోహిత్‌ గాయం అంత తీవ్రమైంది కాదని ఆశిస్తున్నా’’ అని రవిశాస్త్రి చెప్పాడు. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని