60 లక్షల ట్రక్కుల్ని వెనక్కి పిలిపించండి - Recall 60 lakh trucks
close
Published : 24/11/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 లక్షల ట్రక్కుల్ని వెనక్కి పిలిపించండి

జనరల్‌ మోటార్స్‌ను ఆదేశించిన యూఎస్‌ నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌

డెట్రాయిట్‌: ప్రమాదకర తకాటా ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ఫ్లేటర్లు అమర్చిన 60 లక్షల పెద్ద పికప్‌ ట్రక్కులు, ఎస్‌యూవీలను  వెనక్కి పిలిపించాలని జనరల్‌ మోటార్స్‌ (జీఎం)ను అమెరికాలోని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ సోమవారం ఆదేశించింది. వాటికి మరమ్మతు చేసి సంబంధిత యజమానులకు అప్పగించాలని సూచించింది. దీనికి సుమారు 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9000 కోట్లు) ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది జీఎం సంస్థ ఈ ఏడాది ఆర్జించిన ఆదాయంలో మూడో వంతు కావడం గమనార్హం. 2016 నుంచి జీఎం తమ వాహనాల రీకాల్‌ గురించి ఈ ఏజెన్సీపై 4 సార్లు పిటిషన్‌ వేస్తూ వస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ఫ్లేటర్లు రహదారిపై సురక్షితమని, పరీక్షల్లో ఇది తేలిందని కంపెనీ వాదించింది. అయితే యజమానులు మాత్రం భద్రతను విస్మరించి లాభాల కోసమే కంపెనీ పని చేస్తున్నట్లు ఆరోపించారు. వాహనాలు ఢీకొన్నప్పుడు, చిన్నపాటి పేలుడు జరిగి ఎయిర్‌బ్యాగ్‌లు గాలితో నిండటానికి అనువుగా అమ్మోనియం నైట్రేట్‌ను తకాటా ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ఫ్లేటర్లలో వాడుతున్నట్లు జీఎం పేర్కొంది. అయితే ఈ రసాయన పదార్థం వేడికి, తేమకు బహిర్గతమైతే అధిక శక్తితో పేలుతోందని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు సైతం పోతున్నాయని యజమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 27 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా, ఇందులో 18 మంది ఒక్క అమెరికాలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తకాటా ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ఫ్లేటర్లు కలిగిన జీఎం ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కి పిలిపించి, వాటిని సరిచేసి యజమానులకు అందించాలని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ సదరు కంపెనీని ఆదేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని