కొవిడ్‌ నుంచి కోలుకున్న 10 లక్షల మంది - Recoveries from COVID 19 to touch 10 lakh mark
close
Published : 30/07/2020 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ నుంచి కోలుకున్న 10 లక్షల మంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన 10 లక్షల మంది కోలుకున్నారు. దేశంలో ఈరోజు కొత్తగా 48,512 కేసులు నమోదవగా, 768 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు పేర్కొన్న లెక్కల ప్రకారం దేశంలో మొత్తం వ్యాధి పీడితుల సంఖ్య 15,52,495కు చేరింది. మృతుల సంఖ్య 34,384కు పెరిగింది. ఇప్పటివరకు 10,0226 మంది కోలుకున్నారు. 

ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 64.24 శాతానికి చేరగా, మరణాల రేటు 2.25 శాతంగా ఉంది. తమిళనాడులో మరో 6426 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా తమిళనాట కొవిడ్‌ బాధితుల సంఖ్య 2,34,114కు చేరింది. 3741 మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని దిల్లీలో ఇరోజు 1035 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ కాగా, మొత్తంగా 1,33,310కి పెరిగాయి. కాగా ఇప్పటివరకు రాజధానిలో 3,907 మంది మృతిచెందారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని