close

తాజా వార్తలు

Updated : 01/04/2020 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రీల్‌ రాముడు ఫ్యామిలీతో  రామాయణం చూసిన వేళ

ఫొటో వైరల్

దిల్లీ: రీల్‌ రాముడు అరుణ్‌ గోవిల్‌ రియల్‌ లైఫ్‌లో తన కుటుంబంతో కలిసి ‘రామాయణం’ సిరీస్‌ చూశారు. 1987లో ఈ సిరీస్‌ బుల్లితెర ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇన్నేళ్లకు మళ్లీ ‘రామాయణం’ను దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్నారు. సోమవారం ఈ సిరీస్‌ను అరుణ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘రామాయణం’ హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అయ్యింది. బాల్యం గుర్తొస్తోందని చాలా మంది కామెంట్లు చేశారు.

‘రామాయణం’ సిరీస్‌ను మార్చి 28 నుంచి దూరదర్శన్‌లో ప్రసారం చేయబోతున్నామని గతవారం కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. పబ్లిక్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఓ ఎపిసోడ్‌, సాయంత్రం 9 నుంచి 10 వరకు మరో ఎపిసోడ్‌ ప్రసారం అవుతాయని తెలిపారు. ‘రామాయణం’లో సీతగా దీపిక చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లాహిరి నటించారు. వీరికి కూడా మంచి గుర్తింపు లభించింది. 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించారు.

 



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని