వైరల్‌ పిక్‌.. అకీరా,ఆద్యలతో పవన్‌ - Renu Desai Shares Spl Picture In Social media
close
Published : 02/12/2020 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరల్‌ పిక్‌.. అకీరా,ఆద్యలతో పవన్‌

రేర్‌ ఫొటో షేర్‌ చేసిన రేణూదేశాయ్‌

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధినేత, నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో ఉన్న ఓ అపురూప చిత్రాన్ని తాజాగా రేణూదేశాయ్‌ షేర్‌ చేశారు. ఇందులో పవన్‌.. అకీరా-ఆద్యలను ప్రేమతో హత్తుకోగా.. వారిద్దరూ ఆయన భుజాలపై నిద్రపోతున్నట్లు కనిపించారు.

ఒకనాటి ఈ ఫొటోని తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన రేణూ.. ‘కొన్ని అందమైన, ప్రత్యేకమైన ఫొటోలను అందరితో పంచుకోవాలి. అవి కేవలం మీ ఫోన్‌లోని ఫొటో ఆల్బమ్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. నా ఫోన్‌లో నేను తీసిన ఓ అపురూప చిత్రమిది’ అని పేర్కొన్నారు. రేణూ షేర్‌ చేసిన 30 నిమిషాల్లోనే ఈ ఫొటోని ఎంతోమంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్‌ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వకీల్‌సాబ్‌’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనితోపాటు క్రిష్‌, సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌ సినిమాలు చేయనున్నారు. మరోవైపు, రేణూదేశాయ్‌ సైతం ‘ఆద్య’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని