
తాజా వార్తలు
షోలో రేణూదేశాయ్ ఎమోషనల్
హైదరాబాద్: సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్న నటి రేణూదేశాయ్ భావోద్వేగానికి గురయ్యారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సుమ ‘ఈట్ టాక్ విత్ సుమక్క’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి రేణు అతిథిగా విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. మోడలింగ్ వల్ల కాలేజ్ రోజుల్ని తాను ఎంతో మిస్ అయ్యానని చెప్పారు. నిజాయతీ, కష్టపడేతత్వం, దయ అనే పదాలతో తనని నిర్వచించవచ్చని అన్నారు.
పాటలు పాడడమంటే తనకెంతో ఇష్టమని.. ఎప్పటి నుంచో సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ వాయిదా వేస్తున్నానని.. ఎప్పుడైనా ఇంట్లో తాను పాటలు పాడితే అకీరా బాగా నవ్వుతాడని రేణు తెలిపారు. అనంతరం రేణు పుట్టినరోజు సందర్భంగా ఆమెకి కొన్ని బహుమతులిచ్చి సుమ సర్ప్రైజ్ చేశారు. ‘బెస్ట్ మామ్ ఎవర్’ అని ఉన్న కప్‌ని రేణుకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కప్‌పై ఉన్న ఫొటో (రేణు,అకీరా,ఆద్య ఫొటో)చూసి రేణు భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీరు కథలు బాగా రాస్తారు’ అని ఎవరైనా చెప్పినప్పుడు మామూలుగానే తీసుకుంటాను. కానీ, నా పిల్లలు ఎప్పుడైనా ఫంక్షన్స్, పవన్‌కల్యాణ్ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇతర నటీనటులు ఫోన్ చేసి.. ‘ఆద్య, అకీరా చక్కగా ఉన్నారు. మీ పిల్లలు అందరితో కలిసిపోతున్నారు’ అని చెప్పినప్పుడు ఒక తల్లిగా నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది’ అని రేణూ వివరించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
ఎక్కువ మంది చదివినవి (Most Read)
