రోడ్ల కోసం రోజుకు 2 గంటలు! - Repair Potholes on Roads
close
Published : 29/10/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్ల కోసం రోజుకు 2 గంటలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడో ఆటో డ్రైవర్‌. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకుండా నలుగురికీ ఉపయోగకరమైన పని చేసేందుకు నడుం కట్టాడు. అధికారుల తీరుతో విసుగు చెంది గుంతలు పడిన రోడ్డును బాగు చేస్తున్నాడు. సేవా గుణంతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే శ్రీనివాస్‌రెడ్డి.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాసన్‌ వల్లీ రోడ్డులో ఆయన ఆటో నడుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన రహదారిని కలిపే ఈ రోడ్డుపై భారీ వాహనాలూ తిరుగుతుంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రోడ్ల దుస్థితి గురించి గ్రామస్థులతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్‌ రెడ్డి. గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి వివరించారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో విసుగు చెందిన ఆయన ఎవరి సహాయం లేకుండా రహదారిని కొంచెం కొంచెంగా బాగుచేస్తున్నారు. తన పని చేసుకుంటూనే రహదారి మరమ్మతుల కోసం రెండు గంటలు కేటాయిస్తున్నారు. కాసన్‌ వల్లీ లోనే కాదు కోలార్‌ జిల్లా వ్యాప్తంగానూ ఇలాంటి రోడ్లే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు స్పందించక పోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు... శ్రీనివాస్‌ రెడ్డి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని