చైనా సంస్థల టెండర్లపై ఆంక్షలు - Restrictions on tenders of Chinese companies
close
Published : 24/07/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా సంస్థల టెండర్లపై ఆంక్షలు

దిల్లీ: చైనాతో పాటు, భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి ప్రభుత్వ వినియోగం కోసం ఉద్దేశించిన వస్తువుల కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జనరల్‌ ఫైనాన్సియల్‌ రూల్స్‌-2017లో సవరణలు చేస్తూ గురువారం కేంద్ర వ్యయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకొంది. దీని ప్రకారం చైనాతో పాటు, ఇతర దేశాల గుత్తేదార్ల నుంచి వస్తువులు, సేవలు, పనులు పొందడం పరిమితులకు లోబడి ఉంటుంది. ఆయా దేశాల గుత్తేదార్లు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే టెండరు ద్వారా వాటిని సరఫరా చేయగలుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ నిబంధనను పాటించాల్సి ఉంది. ప్రయివేటు సంస్థలకు ఇది వర్తించదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని