ఈడీ ఎదుట హాజరైన రియా  - Rhea Chakraborty Appears Before ED
close
Updated : 07/08/2020 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈడీ ఎదుట హాజరైన రియా 

 

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతికి సంబంధించి నటి రియా చక్రవర్తి మీద పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఆమె శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. తాను సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉందని, తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని  రియా అభ్యర్థించగా..సంస్థ దాన్ని తోసిపుచ్చింది. దాంతో ఈ రోజు ఉదయం ఆమె ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ మృతి వెనక రియా పాత్ర ఉందని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాల నుంచి ఆమె నగదు బదిలీ చేసుకుందని, మానసికంగా వేధించిందని వారు బిహార్‌లో కేసు పెట్టారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ఇదిలా ఉండగా..ముంబయి పోలీసులు రియా చక్రవర్తికి సహకరిస్తున్నారని, కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే పట్నా పోలీసులు రియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆమె ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని కూడా తెలిపింది. అంతేకాకుండా సుశాంత్ కుటుంబ సభ్యులు తన మీద పెట్టిన కేసును పట్నా నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని