‘షకీలా’ న్యూ సాంగ్‌ చూశారా? - Richa Chadha belly dancing skills in Shakeela
close
Published : 11/01/2021 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘షకీలా’ న్యూ సాంగ్‌ చూశారా?

ముంబయి: ఒకప్పుడు శృంగారతారగా వరుస సినిమాలతో అలరించారు షకీలా. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించారు. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘షకీలా’. రిచా చద్దా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘తాజా..’ అంటూ సాగే సాంగ్‌లో రిచా రెట్రోలుక్‌లో అదరగొట్టింది. అంతేకాదు, బెల్లీ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.

సిల్క్‌స్మిత మరణం తర్వాత షకీలా స్టార్‌గా ఎలా ఎదిగింది? కెరీర్‌లో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంది? వరుస హిట్‌లతో దూసుకుపోయిన ఆమె స్టార్‌ హీరోలను సైతం బాక్సాఫీస్‌ వద్ద ఎలా గడగడలాడిందన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంద్రజీత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వీర్‌ సమ్రత్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని