డిటెక్టివ్‌ దివాకరం రంగంలోకి దిగితే..! - Rishab Shetty Bell Bottom Telugu Teaser
close
Published : 08/12/2020 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిటెక్టివ్‌ దివాకరం రంగంలోకి దిగితే..!

హైదరాబాద్‌: హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ఏ చిత్ర పరిశ్రమలోనైనా ‘డిటెక్టివ్‌’ పాత్రలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. వైవిధ్యమైన కథా, కథనాలతో ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంటే సినిమా చూసే ప్రేక్షకుడికి వచ్చే మజానే వేరు. త్వరలోనే అలాంటి చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి, హరిప్రియ కీలక పాత్రల్లో జయతీర్థ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. గతేడాది కన్నడంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇతర భాషల్లో ఆసక్తికలిగిన, అద్భుత విజయాలను సొంత చేసుకున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా డిసెంబరు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘బెల్‌బాటమ్‌’ టీజర్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని