భర్త కామెంట్‌.. జెనీలియా రియాక్షన్‌ - Riteish Deshmukh is proud to be known as Genelias husband
close
Published : 27/10/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త కామెంట్‌.. జెనీలియా రియాక్షన్‌

సమానత్వం కోసం పోరాడే ఈ ప్రపంచంలో..

ముంబయి: తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యలపై నటి జెనీలియా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన భార్యను కావడం గర్వంగా ఉందన్నారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా రాణించిన ఈ భామ పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. ఈ బాలీవుడ్‌ పాపులర్‌ జంట తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్‌ మాట్లాడిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ‘జెనీలియా భర్తగా నాకు గుర్తింపు రావడం పట్ల గర్వపడుతున్నా’ అని ఆయన అనడంతో స్టూడియోలోని న్యాయ నిర్ణేతతోపాటు ఆడియన్స్‌ కూడా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను జెనీలియా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘పురుషుడితో సమానంగా చూడాలని మహిళ పోరాడుతున్న ఈ ప్రపంచంలో నువ్వు నేను గర్వించేలా చేశావు రితేష్‌. ఇదే సందర్భంగా నేను నీకొకటి చెప్పాలి అనుకుంటున్నా.. ‘రితేష్‌ భాగస్వామి’గా ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు. వీరిద్దరికి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మహారాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ కుమారుడు రితేష్‌. ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి సమయంలో ప్రమాణం (రాజకీయ నాయకుల ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశిస్తూ) చేయకుండా జెనీలియాతో ఏడడుగులు ఎందుకు వేశారు? అని రితేష్‌ను ప్రశ్నించగా ఫన్నీ రిప్లై ఇచ్చారు. ‘ఐదేళ్ల గవర్నమెంట్‌ కోసం ప్రమాణం చేస్తాం. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారిపోతుంది. అందుకే ఏడడుగులు వేశా..’ అని చెప్పడంతో జెనీలియా తెగ నవ్వుకున్నారు.
2003లో ‘తుజే మేరీ కసమ్‌’ సినిమా సమయంలో రితేష్‌, జెనీలియా మధ్య ప్రేమ ఏర్పడింది. 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు. 2003లో ‘సత్యం’తో తెలుగు వారిని పలకరించిన జెనీలియా ‘సై’, ‘నా అల్లుడు’, ‘హ్యాపీ’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘రెడీ’ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో ఫాలోవర్స్‌ను ఏర్పరచుకున్నారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని