రవితేజ చిత్రంలో పెళ్లి చూపులు భామ? - Ritu Varma to star in Ravi Tejas upcoming film with Ramesh Varma
close
Updated : 16/10/2020 23:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 రవితేజ చిత్రంలో పెళ్లి చూపులు భామ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కుర్రకారు మది దోచుకున్న కథానాయిక రీతూవర్మ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆమెకు మరో బంపర్‌ ఆఫర్‌ లభించినట్లు టాలీవుడ్‌ టాక్‌. రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజకీయం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఇందులో కథానాయిక కోసం చిత్ర బృందం రీతూ వర్మను సంప్రదించిందని టాక్‌. దర్శకుడు రమేశ్‌ వర్మ ఆమెను కలిసి కథను వినిపించారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా వెంటనే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అటు రీతూ వర్మ, ఇటు చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’లో రీతూ నటిస్తోంది. మరోవైపు రవితేజ ‘క్రాక్‌’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. గోపిచంద్‌ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని, అలీ బాషా, చిరాగ్‌ జానీ, దేవీ ప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని