సుశాంత్‌ ఖాతాలోని రూ.50కోట్లు ఏమయ్యాయి? - Rs 50 cr withdrawn from Sushant Singh Rajput account says Bihar DGP
close
Updated : 04/08/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ ఖాతాలోని రూ.50కోట్లు ఏమయ్యాయి?

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసును ఎందుకు ఆర్థిక కోణంలో విచారణ చేయటం లేదని బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ముంబయి పోలీసులను ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.50కోట్లు విత్‌ డ్రా అయ్యాయని, కేవలం ఏడాది కాలంలో రూ.15కోట్ల నగదును డ్రా చేశారని తెలిపారు.

‘‘గత నాలుగేళ్లలో సుమారు రూ.50కోట్లు సుశాంత్‌ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే అవన్నీ విత్‌ డ్రా కావడం. ఏడాది కాలంలో రూ.17కోట్లు జమ అయితే, అందులో రూ.15కోట్లను విత్‌డ్రా చేశారు. ఈ కేసు విచారణలో ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్‌. ఈ విషయంలో మేము మౌనంగా ఉండాలనుకోవడం లేదు. దీనికి ముంబయి పోలీసులు సమాధానం చెప్పాలి’’ అని డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

సుశాంత్‌ కేసు విచారణకు వెళ్లిన పట్నా(సెంట్రల్‌) ఎస్పీ వినయ్‌ తివారిని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడాన్ని ఖండించారు. ‘‘సుశాంత్‌ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ నివేదిక మాకు ఇవ్వాల్సింది పోయి, ఎస్పీని గృహనిర్బంధం చేశారు. ఇలాంటి సహాయ నిరాకరణ ఏ ఇతర రాష్ట్ర పోలీసులు చేయడం నేను చూడలేదు. ఒక వేళ ముంబయి పోలీసులు నీతి, నిజాయతీ కలిగిన వాళ్లు అయితే, తప్పకుండా ఆ విషయాలన్నీ మాతో పంచుకోవాలి’’ అని అన్నారు.

ఇక సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా రియా చక్రవర్తి ఖాతాకు ఎక్కడా నగదు బదిలీ కాలేదని, దీనిపైనా తాము విచారణ జరుపుతున్నట్లు ముంబయి పోలీసు కమిషనర్‌ పరమ్‌ బిర్‌ సింగ్‌ తెలిపారు. ‘బిహార్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రూ.15కోట్లు సుశాంత్‌ ఖాతా నుంచి డ్రా చేసినట్లు పేర్కొన్నారు. ఆయన ఖాతాలో రూ.18కోట్లు ఉన్నట్లు మేం గుర్తించాం. కొంత నగదు డ్రా అవ్వగా, ఇంకా రూ.4.5కోట్లు ఉన్నాయి. రియా చక్రవర్తి ఖాతాకు ఎక్కడా నేరుగా నగదు బదిలీ జరగలేదు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.’’ అని ముంబయి పోలీసు కమిషనర్‌ తెలిపారు.

మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సిఫార్సు చేశారు.‘సుశాంత్‌ తండ్రితో బిహార్‌ డీజీపీ ఈ ఉదయం మాట్లాడారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. దీంతో మేం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నాం’ అని సీఎం నితీశ్‌కుమార్‌ జాతీయ మీడియాతో అన్నారు. ప్రస్తుతం ముంబయి, బిహార్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేర్వేరుగా చేపడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని