ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు  - SEC video conference with collectors today
close
Updated : 19/11/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు గురించి అందులో ప్రస్తావించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఎస్‌ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు. కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ కార్యాలయం ఎర్పాట్లు చేయగా.... కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌ కూడా రద్దవడంతో ఎస్‌ఈసీ కార్యాలయం‌ కార్యాచరణ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు

ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌  విజ్ఞప్తి చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో టేపులను గవర్నర్‌కు పంపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అయినా.. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా  రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..
రాజ్యాంగ విరుద్ధం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని