ప్రపంచం నాశనమైతే..? అందరికీ అదే దిక్కు - SEED VAULT by Puri mussings
close
Published : 14/12/2020 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచం నాశనమైతే..? అందరికీ అదే దిక్కు

గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌పై పూరీ జగన్నాథ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచం నాశనమయ్యేలోపు నార్వేలోని విత్తన ఖజానా(సీడ్‌ వాల్ట్‌) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని.. మన భవిష్యత్తు తరాలకు అదే భరోసానిచ్చే నిధి అని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. ప్రపంచం నాశనమయ్యేలోపు ప్రతి ఒక్కరూ ఆ ఖజానా గురించి తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ఈసారి ‘గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌’ అనే అంశంపై మాట్లాడారు. దాని గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన మాటల్లోనే మీకోసం..

‘‘వంద సునామీలు వచ్చి ఈ ప్రపంచం మునిగిపోతే..! ఏదో ప్రళయం వచ్చి అంతా నాశనమైపోతే..! మానవజాతి మొత్తం చనిపోయి కొంతమందే మిగిలితే..! గ్రహశకలాలు కావచ్చు.. భూకంపాలు కావచ్చు.. అలాంటిది ఏదైనా జరిగి.. భూమ్మీద ఉన్న ప్రకృతి నాశనమైపోయినా.. పంటలు మొత్తం మంటగలిసిపోయినా.. ఏంటి పరిస్థితి.? అలాంటి పరిస్థితే వస్తే.. మనకో బ్యాకప్‌ కావాలి. దాని కోసం పెట్టిందే.. గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌(ప్రపంచ విత్తన ఖజానా). నార్వే సమీపంలోని ఉత్తరధృవంలో ఉన్న ఒక చిన్న దీవిలో ఒక కొండను 120మీటర్ల లోతు తవ్వారు. అక్కడ ఈ సీడ్‌వాల్ట్‌ పెట్టారు. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న విత్తనాలన్నీ సేకరించి ఆ విత్తన నమూనాలు మొత్తం అక్కడ భద్రపరిచారు. కరెంట్ లేకపోయినా మైనస్‌ ఉష్ణోగ్రత వాతావరణంలో విత్తనాలు ఏళ్ల తరబడి నిల్వ ఉంటాయి. ఆహార సరఫరా కోసం ఇది ఒక అద్భుతమై బీమా పాలసీ. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా జరిగితే.. మన భవిష్యత్తు తరాల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది శతాబ్దాల కాలం పాటు భరోసా ఇస్తాయి’’ అని పూరి పేర్కొన్నారు.

‘‘ఈ సీడ్‌ వాల్ట్‌లో 4.5మిలియన్ల రకాల పంటలు ఉన్నాయి. ఒక్కో రకానికి 500 విత్తనాలు. మొత్తం 2.5బిలియన్‌ విత్తనాలు ఇక్కడ దాచారు. ఆఫ్రికా, ఆసియాల్లో బియ్యం, గోధుమలు.. అలాగే దక్షిణ అమెరికాలో ఉండే.. ఎగ్‌ప్లాంట్‌, బార్లీ, ఆలు.. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి రకరకాల విత్తనాలు సేకరించి పెట్టారు. వీటిని జీనీ బ్యాంక్స్‌ అంటారు. మీకు కావాలంటే ఇక్కడో లాకర్‌ ఇస్తారు. మీకు నచ్చినవి.. ఎక్కడా దొరకని విత్తనాలు ఇక్కడ దాచుకోవచ్చు. దాన్ని బ్లాక్‌ బాక్స్‌ అంటారు. ఇది మనందరికీ తెలియాలి. లేదంటే అందరూ చచ్చిపోయి.. మిగిలిన వాళ్లకు ఇక్కడున్న సీడ్‌వాల్ట్‌ ఉన్న విషయం తెలియకపోతే ఎలా..? చేసింది మొత్తం వేస్ట్‌ అయిపోయినట్లే.. అందుకే చెప్తున్నా.. భవిష్యత్తులో మనం అలాంటి దరిద్రాలు మనం చూడబోతున్నాం. ఏదో ఒకరోజు కొంతమంది సీడ్‌వాల్ట్‌ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్‌చేసే రోజు వస్తుంది. ఆ రోజుకి ఆ సీడ్‌ వాల్ట్‌ మానవజాతికి పెద్ద నిధిలా కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మీ పిల్లలకు కూడా చెప్పండి. ఆ నిధి నార్వేలో ఉంది. ఆ దీవి పేరు స్పిట్స్‌బర్జెన్‌(Spitsbergen)’’ అని పూరీ తన విశ్లేషణ ముగించారు.

ఇదీ చదవండి..

యూట్యూబ్‌ టాప్‌10‌లో మూడు తెలుగు పాటలు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని